డి. హిరేహాల్ మండలం కూడ్లూరు గ్రామంలో పురాతన బసవేశ్వర ఆలయం గోపుల కలశాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ఎత్తుకెళ్లారని గ్రామస్తులు విలేఖరులకు తెలిపారు. గ్రామస్తులు బసవేశ్వర ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లిన భక్తులు గోపురంపై కలశం లేకపోవడం చూశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దేవాలయం వద్దకు చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.