బ్రహ్మసముద్రం మండల పరిధిలోని 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఇటీవల బీటీపీ గేట్లు ఎత్తడంతో వరదనీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన గుమ్మఘట్ట వేదవతి హగరిపై ఉన్న కాజ్వేను వేపులపర్తి, గోవిందయ్యదొడ్డి, గుండి గానిపల్లి గ్రామస్థులు శుక్రవారం చొరవ తీసుకొని యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి బాగు చేసుకున్నారు. టీడీపీ మండల కన్వీనర్ శ్రీరాములు సహకారంతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి ఈ మరమ్మతులు చేపట్టారు.