బళ్లారి నుంచి అనంతపురం వైపు ఒక పెద్ద కంటైనర్ లో 17 ఆవులను తరలిస్తుండగా రాయదుర్గం పట్టణంలో విశ్వహిందూ పరిషత్ నియోజకవర్గం అధ్యక్షుడు రాజేష్, నియోజకవర్గ గోరక్షకదళ్ అధ్యక్షుడు ప్రశాంత్ బుధవారం అడ్డుకున్నారు. ఈ విషయాన్ని వారు వెంటనే పోలీసులకు తెలిపారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని పరిశీలించి కంటైనర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.