తుంగభద్ర జలాశయం నుంచి ఈ నెల 10న నీటిని హెచ్చెల్సీకి విడుదల చేశారు. ఈ క్రమంలో నీళ్లు ఆదివారం బొమ్మనహాళ్ సరిహద్దులోని 105 కిలోమీటర్ వద్దకు చేరుకొన్నాయి. ఆంధ్రలోకి రాకుండా అధికారులు గేట్లు వేశారు. హెచ్చెల్సీకి మరమ్మతులు జరుగుతుండడంతో సరిహద్దులో గేట్లను దింపారు. ఈ సారి తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు రావడంతో ముందస్తుగా హెచ్చెల్సీకి విడుదల చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.