కణేకల్లు, తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి ఈనెల 15వ తేదీ వరకు నీరు విడుదల చేయనున్నట్లు డీఈ దివాకర్రెడ్డి శుక్రవారం తెలిపారు. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీ నీటి వాటాగా 25,775 టీఎంసీలు కేటాయించారని, ఎల్లెల్సీ నుంచి మరో మూడు టీఎంసీలు హెచ్చెల్సీకి కేటాయించామన్నారు. నీటి వాటా పెరగడంతో 15 వరకు హెచ్చెల్సీకి నీరిస్తామని, ముఖ్యంగా జీబీసీ పరిధిలోని దర్గాహోన్నూరు, విడపనకల్లు ప్రాంతాల్లో మిర్చి పంట సాగులో ఉండడంతో నీటి ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు.