రోడ్డు ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

అనంతపురం హైవేపై దేవిరెడ్డిపల్లి వద్ద డ్రైవింగ్ స్కూల్ కారు యూ-టర్న్ తీసుకుంటుండగా, బైక్‌పై వెళ్తున్న దంపతులు, వారి రెండేళ్ల కుమారుడు కారును ఢీకొట్టారు. ఈ ఘోర ప్రమాదంలో గొల్ల వీరభద్ర, ఆయన గర్భిణి భార్య గంగమ్మ, కుమారుడు సూర్య తీవ్రంగా గాయపడ్డారు. కళ్యాణదుర్గం ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్