ప్రసన్న వెంకటేశ్వరుడి సన్నిధిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు

శనివారం రాయదుర్గం పట్టణంలో కొలువైన ప్రసన్న వెంకటేశ్వరస్వామిని అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగ రాజు దర్శించుకున్నారు. అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం, ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూల నాగరాజు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్