రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయునికి తీవ్ర గాయాలు

రాయదుర్గంలో నివాసం ఉంటూ గుమ్మగట్ట మండలంలో ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న బషీర్ అహ్మద్ బుధవారం అనంతపురం వెళ్లి తిరిగి కారులో వస్తుండగా పంపనూరు సమీపంలో అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో బషీర్ తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను అంబులెన్స్లో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్