రాయదుర్గం మండలం వడ్రహొన్నూరు సమీపంలో అనంతపురం జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం లారీ, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వడ్రహొన్నూరుకు చెందిన విజయ్, బాలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు సిఫార్సు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలపై విచారణ జరుపుతున్నారు.