కణేకల్లు పట్టణంలో గొల్ల వరుణ్(18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మే 28న తిరుపతికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన వరుణ్ మృతదేహం మంగళవారం గ్రామ సమీపంలోని నీటికుంటలో లభ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.