శింగనమలలో మద్యం మత్తులో యువకుల ఘర్షణ

శింగనమల మండలం శోదనపల్లిలో మద్యం మత్తులో ఉన్న యువకులు అదే గ్రామానికి చెందిన డాల్ వీరనారాయణపై దాడి చేశారు. ఎందుకు గొడవ చేస్తున్నారని ప్రశ్నించిన వీరనారాయణపై యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వీరనారాయణ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులైన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్