పుట్లూరు మండలంలో విద్యుత్ కేబుల్ వైర్ల చోరీలు పెరగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిన్న చింతలపల్లెలో జరిగిన ఘటన మరువకముందే, పుట్లూరులోని వ్యవసాయ పొలాల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కేబుల్ వైర్లను దొంగిలించారు. లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, పెద్దయ్యలకు చెందిన వైర్లు పోవడంతో వారు తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలతో రైతులు భయాందోళనలకు లోనవుతున్నారు.