అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో ఉన్న సెంట్రల్ యూనివర్శిటీ వసతిగృహంలో వైరల్ ఫీవర్ ప్రబలింది. గత రెండు రోజులుగా సుమారు 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 50 మందికి అనంతపురంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.