ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు

నార్పల మండలం బి. పప్పూరు వంతెన వద్ద అదుపుతప్పిన ఆటో ముళ్ల కంపల్లోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 సిబ్బంది (వంశీ, అనీల్) వారిని గోల్డెన్ అవర్స్ లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నార్పల-బత్తలపల్లి మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్