అనంతపురం రోడ్లు భవనాల అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి. వెంకటప్ప అధ్యక్షతన మంగళవారం గిరిజన అధికారులతో, ప్రిన్సిపల్ హాస్టల్స్ వార్డెన్ లతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, హాస్టళ్లను శుభ్రంగా నిర్వహించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి. వెంకటప్ప వార్డెన్ లకు, ప్రిన్సిపాల్ లకు ఆదేశాలు జారీ చేశారు.