పుట్టపర్తిలోని మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. కార్యాలయ పనితీరు, సిబ్బంది హాజరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. పట్టణ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారులు, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.