శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గంలో సుమారు 15 మంది లబ్ధిదారులకు మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.6,18,416 విలువైన చెక్కులను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నారని కొనియాడారు.