ఇల్లూరు గ్రామం గార్లదిన్నె మండలం లో “సుపరిపాలనలో తొలి అడుగు -ఇంటింటికి టీడీపీ" కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి ఎంపీ అంబికా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల ఇంటింటికి వెళ్లి, ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య పింఛన్లు, దీపం, సూర్యఘర్, ఉపాధి అవకాశాలు, రుణ మాఫీ, బీసీ/ఎస్సీ సంక్షేమ పథకాల అమలు స్థితిని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.