గార్లదిన్నె మండలం, కృష్ణాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎడిసిసి బ్యాంకు చైర్మన్ కేశవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి కానుకలు సమర్పించారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు పంటలు పుష్కలంగా పండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.