ప్రముఖ వైద్యుడు, పావని హాస్పిటల్ అధినేత గుత్తా రవీంద్ర గారి తండ్రి, నాయనవారి పల్లె మాజీ సర్పంచ్ గుత్తా నరసయ్య గారు అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతి పట్ల అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, సింగనమల శాసన సభ్యురాలు బండారు శ్రావణిశ్రీ, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, టిడిపి నాయకులు సంతాపం తెలిపారు. గుత్తా నరసయ్య ఆత్మకు శాంతి చేకూరాలని దగ్గుపాటి ప్రసాద్ ఆకాంక్షించారు.