పేదలకు కేటాయించిన ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సీపీఐ నార్పల మండల కార్యదర్శి గంగాధర్ కోరారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో ‘మీ కోసం’ కార్యక్రమంలో తహశీల్దార్ అరుణ కుమారికి వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 197/2లో కొందరు ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్నారని తెలిపారు.