శ్రీ వీరపెద్దన్నస్వామి ఉత్సవాలకు సన్నాహాలు పూర్తి

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని ఎల్లుట్ల గ్రామంలో శ్రీ వీరపెద్దన్నస్వామి వార్షిక ఉత్సవాలు రెండు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 1వ తేదీన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా స్వామి వారి గుడి నుంచి ఉత్సవ విగ్రహాలను డప్పు సంగీత వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకువస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి దర్శనం పొందనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్