పుట్లూరు: సార్వత్రిక బంద్ విజయవంతం

పుట్లూరు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, గ్రామ సచివాలయాలు, తపాలా కార్యాలయాలు, విద్యాలయాల్లో సీపీఐ, సీపీఎం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం సార్వత్రిక బంద్ జరిగింది. లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్రం కార్మిక హక్కులను హరించిందని, ప్రైవేటీకరణను నిలిపి, కూలీలకు న్యాయవేతనాలు కల్పించాలని నాయకులు అన్నారు.

సంబంధిత పోస్ట్