శింగనమల: విషపు నీరు తాగి 40 గొర్రెలు మృతి

శింగనమల మండలంలోని చక్రాయపేట గ్రామంలో శనివారం పురుగుల మందు కలిపిన నీటిని తాగి 40 గొర్రెలు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. సి. బండమీదపల్లి గ్రామానికి చెందిన కాపరులు తమ గొర్రెలను చక్రాయపేట సమీపంలోని కంది చేనులో మేపడానికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం దాహం తీర్చడానికి నరసింహారెడ్డి తోటలోకి తీసుకెళ్లగా, అవి పురుగుమందు కలిపిన నీటిని తాగడంతో కొద్దిసేపటికే కుప్పకూలి మరణించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్