శింగనమల: ఆదర్శప్రాయుడు మహాత్మాగాంధీ: టిడిపి నాయకులు

అనంతపురం అర్బన్, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస మార్గాల్లో దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని, 40 కోట్ల మంది భారతీయులను స్వాతంత్ర్య ఉద్యమంలో ఏకం చేశారని వక్తలు కొనియాడారు.

సంబంధిత పోస్ట్