బక్కరాయసముద్రంలో భక్తవరదుడైన కొండ మీద రాయుడు గురువారం హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. గ్రామవీధుల్లో ఊరేగుతున్న స్వామి వారిని చూసి భక్తులు గోవిందనామాన్ని ప్రతిధ్వనించారు. స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు హనుమద్వాహన సేవ నేత్ర పర్వంగా సాగింది. ఉదయం స్థానిక అంజనేయస్వామి ఆలయంలో స్వామి ఉత్సవ మూర్తులకు వేద పండితులు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పల్లకీలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం గరుడవాహన సేవ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.