శింగనమల: దేవరకొండ చుట్టూ రోడ్డు నిర్మిస్తున్న భక్తుడు

అరుణాచలం తరహాలో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దేవరకొండలోనూ గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులకు త్వరలో అవకాశం లభించనుంది. అనంతపురం నగరానికి చెందిన భక్తుడు గంగాధర్ తన సొంత నిధులతో రూ. 15 లక్షలు వెచ్చించి, 3.7 కిలోమీటర్ల పొడవుతో గిరి ప్రదక్షిణ మార్గానికి రోడ్డు పనులు చేపట్టారు. ఈ రోడ్డు పూర్తయితే ప్రతి నెలా పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేసేందుకు వీలు కలుగుతుంది. గురువారం దేవరకొండపై వెలసిన కొండ మీదరాయుడిపై భక్తితో ఈ పనులు ప్రారంభమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్