నార్పల మండల కేంద్రానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి ఏఎస్ఓగా, షేక్ షెక్షావలి సబ్ రిజిస్ట్రార్‌గా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ పూర్తి చేసిన అనిల్ కుమార్ రెడ్డి గతంలో రెండుసార్లు సివిల్స్ పరీక్షలు రాశారు. ఎస్కేయూలో ఎంఎస్సీ ఫిజిక్స్ చదివిన షెక్షావలి, తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి కష్టాన్ని చూసి కష్టపడి చదివానని తెలిపారు. ఈ ఎంపికలు నార్పల ప్రాంతంలో సంతోషాన్ని నింపాయి.