తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు కల్తీ నూనెలు వాడటం మహాపాపమని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు. శుక్రవారం నార్పలలో నిర్వహించిన మహా పాపం నిజం ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. దాదాపు 20 కోట్ల కల్తీ లడ్డూలు తయారైనట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైందని ఆమె పేర్కొన్నారు. ప్రజలను మోసంచేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం మహాపాపమని విమర్శించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.