శింగనమల మండల కేంద్రంలో శనివారం ఆర్టీసీ బస్సులో సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలను, బస్సు నిండిపోయిందని డ్రైవర్, కండక్టర్లు ఎక్కించుకునేందుకు నిరాకరించారు. దీంతో సుమారు 20 మంది కార్యకర్తలు బస్సు కదలనివ్వకుండా నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్, కండక్టర్లతో వాగ్వాదానికి దిగి, అరగంట పాటు బస్సును నిలిపివేశారు.