శింగనమల: టీడీపీ కార్యకర్తపై దాడి

శింగనమల మండలంలోని చిన్నమట్ల గొంది గ్రామంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్త రామచంద్రపై దాడి చేసి గాయపరిచారు. గత 5 రోజులుగా వేరుశెనగ పొలంలో బోరులారీని పోనిచ్చారని ఆరోపిస్తూ వైసీపీ కార్యకర్తలు మునేంద్ర, గజేంద్ర శనివారం సాయంత్రం రామచంద్రతో గొడవపడ్డారు. ఈ దాడిలో రామచంద్ర తలకు తీవ్ర గాయాలవడంతో అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్