తల్లికి వందనం నిధులను లబ్ధిదారులకు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని సింగనమల మండల వ్యవసాయకార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. సలకంచెరువు ఎస్‌బీఐ బ్యాంక్ వద్ద మాట్లాడిన ఆయన, అప్పులు ఉన్నవారికి నిధులు ఇవ్వకుండా బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. బ్యాంక్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుని డబ్బులు అందించాలన్నారు.