శింగనమల: ముగిసిన భాగవత సప్తాహం

నార్పల మండలంలోని బండ్లపల్లి గ్రామంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో నార్పల తిక్కయ్యస్వామి భాగవత భక్తి సమాజం సభ్యులు నిర్వహించిన భాగవత సప్తాహం గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ మాజీ సభ్యుడు, ఆధ్యాత్మికవేత్త ఎన్. తులసిరెడ్డి మాట్లాడుతూ, భాగవతం, రామాయణం భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపాలన్నారు. రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి ఒక ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో సమాజానికి తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామస్థులు తులసిరెడ్డిని సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్