అనంతలో మరోరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సింగనమల మండలం కొరివిపల్లి గ్రామానికి చెందిన జగన్నాథ రెడ్డి అనే రైతు తన పోలంలోనే క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అప్పుల బాధతోనే జగన్నాథ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు.