శింగనమల: జంట హత్యలపై దర్యాప్తు ముమ్మరం

శింగనమల మండలంలోని తరిమెల గ్రామంలో మంగళవారం జరిగిన తల్లి, కుమారుడి హత్యలపై దర్యాప్తు ముమ్మరం చేశామని సీఐ కౌలుట్లయ్య బుధవారం తెలిపారు. ఇప్పటికే ఓంకార్ అనే యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. జగ్జీవన్, మరో యవకుడి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. హత్యలపై ప్రత్యేక టీం ద్వారా విచారణ జరుగుతోందని, రెండు మూడు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని సీఐ వివరించారు. తరిమెల ఎస్సీ కాలనీలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్