సింగనమల మండలంలో టీడీపీ కన్వీనర్ ఎంపిక కార్యక్రమం శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి, తమ అనుకూల వ్యక్తిని కన్వీనర్ గా ఎంపిక చేయాలని గట్టి వాదనలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మధ్యస్థంగా వ్యవహరించి పరిస్థితిని తాత్కాలికంగా సద్దుమణుగు చేశారు.