వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై పూల నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణీ శ్రీ, జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీధర్ చౌదరి ఫిర్యాదు చేశారు. పూల నాగరాజు మాట్లాడుతూ, రాజకీయాల్లో అంబటి రాంబాబు మంచిగా వ్యవహరించాలని హితవుపలికారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదని ఆయన అన్నారు.