శింగనమల: రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ఆర్డిఓ

శుక్రవారం శింగనమల మండలంలోని కర్ణాటకపల్లి, బుడేపల్లి గ్రామాల రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను మార్కెట్ యార్డు చైర్మన్ దండు శ్రీనివాసులు, తహసీల్దా శేషారెడ్డి, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ నారాయణస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారనాయుడు, ఆదినారాయణ, గంగాధర్, పరుశురాం, నగేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్