శింగనమల: నీటి వనరులను వాడుకోండి: ఎమ్మెల్యే

శింగనమల నియోజకవర్గంలోని చెరువులు, కుంటలకు అవసరమైన నీటి వనరులను సకాలంలో వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో హెచ్ఎల్సీ అధికారులు, వాటర్హెడ్, నీటి సంఘాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సూచనలు చేశారు. చెరువుల మరమ్మతులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, శింగనమల చెరువు లోకలైజేషన్ పనులు చేపట్టాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో నీటి విడుదల, చెరువుల నిర్వహణపై చర్చించారు.

సంబంధిత పోస్ట్