అనంతపురం జేఎన్టీయూలోని పరిపాలన భవనంలో మంగళవారం వీసీ హంచాటే సుదర్శన రావు, యూనివర్సిటీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. 15వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజులలో యూనివర్సిటీ మరిన్ని విజయాలు సాధించేందుకు కష్టపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, యూనివర్సిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.