యువకుడిపై కొడవళ్లతో దాడి

బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి చెన్నంపల్లికి చెందిన ఆచారి మణికంఠ అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో స్థానికులు అతన్ని 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్