పెద్దవడుగూరు మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కాసేపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 42,600 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనతో మండలంలో కలకలం రేగింది.