తాడిపత్రి మండలం ఊరుచింతల సమీపంలోని అదానీ మైన్స్ వద్ద చిరుతపులి కనిపించడంతో స్థానికులు, కార్మికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అటవీ అధికారులు రెండు రోజులుగా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, చిరుతపులి జాడ ఇంకా కనిపించలేదు. అధికారులు అటవీ ప్రాంతాన్ని ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.