అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో దారుణ హత్య జరిగింది. ఏటిగడ్డపాలెంలోని బ్రహ్మంగారి గుడి వద్ద బంకమట్టి వీధికి చెందిన పెయింటర్ బాషా కుమారుడు అబ్దుల్లా (బండ)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కత్తితో మెడపై పొడిచి, బండరాయితో తలపై దాడిచేసి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే గతంలో తన కుమారుడిపై నాలుగు సార్లు అటాక్ సైతం జరిగిందని మృతుడు తండ్రి వాపోయారు. దాదాపు 30 మంది వచ్చి దాడి చేశారని, అబ్దుల్ వైసీపీలో ఉన్నట్లు తెలిపారు. హంతకులను పట్టుకోవాలని కోరారు.