ఇదేనా స్వచ్ఛ శుభ్రత

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో పదకొండవ శతాబ్దం లోని పురాతన దేవాలయాల్లో ఒకటైన శ్రీ చింతల వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం నిత్యము భక్తులు స్వామివారిని ఎంతో భక్తి ప్రేమలతో దర్శించుకుని తన్మయత్వం పొందుతూ ఉంటారు. ఇది టీటీడీ వారి ఆధ్వర్యంలో నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ దేవాలయం నలువైపుల చెత్తకుప్పలు పేరుకొనిపోయి వాటినుండి ఈగలు దోమలు దుర్వాసన వస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విచిత్రమైన రోగాలతో దేశం విలవిల్లాడుతున్నది. మరి ఈ చెత్త గురించి దేవాదాయ శాఖ ఈవో కి మరియు దేవాలయం లోని కమిటీ వారి గాని లేదా పురోహితుల గాని ఈ కుప్పలు కనిపించడం లేదా? భక్తులు వీటి వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఈవో లేదా కమిటీ వారైనా దీనిని వెంటనే శుభ్రపరచి భక్తులకు మరియు పరిసర ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా వెంటనే శుభ్రపరుస్తారు అని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕