యాడికి మండల వ్యాప్తంగా డీజిల్ కొరత.. ఇబ్బందుల్లో వాహనదారులు

యాడికి మండల కేంద్రంలోని రెండు పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడింది. గుత్తి రోడ్డు, బుగ్గ రోడ్డులోని బంకుల్లో డీజిల్ పూర్తిగా అయిపోవడంతో నిర్వాహకులు పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. దీంతో యాడికితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాహనదారులు డీజిల్ కోసం గుత్తికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్