తాజా గ్రూప్-2 ఫలితాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భార్యాభర్తలు సత్తా చాటారు. భార్య వినీత సబ్ రిజిస్ట్రార్‌గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న సమయంలో గ్రూప్-2 నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రిపేర్ అయ్యారు. ఇద్దరూ ఉద్యోగాలు సాధించడంతో వారి ఇంట్లో ఆనందం రెట్టింపయ్యింది. మొత్తం 891 మంది గ్రూప్-2 ఉద్యోగాలు సాధించారు.