అనంతపురం జిల్లాలో నీట్ పరీక్షల కు సర్వం సిద్ధం

అనంతపురం జిల్లాలో ఈ నెల 3న జరగనున్న నీట్ పరీక్షల ఏర్పాట్లపై జిల్లా రెవెన్యూ అధికారి మలోల ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతపురంలో ఆరు, గుత్తిలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 3,616 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్