అర్ధరాత్రి వేళ పోలీసుల విస్తృత తనిఖీలు

తాడిపత్రిలో పోలీసులు అర్ధరాత్రి వేళలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తన సిబ్బందితో కడప ప్రధాన రహదారిపై విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్