యాడికి మండలంలో అప్పుల బాధను తట్టుకోలేక బుధవారం ఓ యువ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయలచెరువు గ్రామానికి చెందిన తలారి కృష్ణయ్య వ్యవసాయం చేస్తూ, పంటల కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక పొలంలోనే పురుగు మందు తాగాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.